H10N3: చైనాలో కొత్త రకం బర్డ్‌ ఫ్లూ

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా హెచ్‌10 ఎన్‌3 రకం బర్డ్‌ఫ్లూ కేసు చైనాలో నమోదయ్యింది. తూర్పు జియాంగ్స్‌ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్‌గా పిలిచే ఈ వైరస్‌ను 41 ఏళ్ల వ్యక్తిలో గుర్తించినట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది.

Updated : 01 Jun 2021 22:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా హెచ్‌10 ఎన్‌3 రకం బర్డ్‌ఫ్లూ కేసు చైనాలో గుర్తించారు. తూర్పు జియాంగ్స్‌ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్‌గా పిలిచే ఈ వైరస్‌ను 41 ఏళ్ల వ్యక్తిలో గుర్తించినట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే సదరు వ్యక్తికి వైరస్‌ ఏవిధంగా  సోకిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చైనా ప్రభుత్వ సీజీటీఎన్‌ టీవీ వెల్లడించింది. కాగా  కొన్ని రకాల బర్డ్‌ఫ్లూ వైరస్‌లు పౌల్ట్రీ నుంచి మానవులకు సంక్రమిస్తాయనీ, ఈ కొత్తరకం వైరస్‌ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని, దీని వ్యాప్తి పెద్దగా ఉండబోదని నిపుణులు చెబుతున్నారు.

చైనాలో పలు రకాల ఇన్‌ఫ్లూయెంజా స్ట్రెయిన్‌లను గతంలోనూ గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అడవి పక్షులలో అధిక వ్యాధికారకమైన హెచ్‌5ఎన్‌6 రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా(ఏఐ)కు చెందిన టైప్‌-ఏ వైరస్‌లో ఒకరకం హెచ్‌5ఎన్‌8. దీన్నే రష్యన్‌ బర్డ్‌ ఫ్లూ వైరస్‌గా వ్యవహరిస్తారు. దీని ప్రభావం అడవి పక్షులు, పౌల్ట్రీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే పందుల నుంచి మానవులకు సంక్రమించే H3N2, H1N1 వంటివైరస్‌లు కూడా ఈ రకానికి చెందినవే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని