Published : 20 Jan 2021 09:12 IST

ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..

కమలకు నచ్చిన వంటకం ప్రత్యేకం

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణస్వీకారానికి రానున్న అతిథులు నోరూరించే వంటకాలను ఆరగించనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ అతిథులకు నలభీమపాకం రుచిచూపించబోతున్నాడు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేయనున్న విందులో కమలా హారిస్‌కు ఇష్టమైన వంటకం సీఫుడ్‌ ‘గంబో’ను కూడా చేర్చారు. ‘గంబో’ అనేది ఒక చిక్కనైన సూపు. దీన్ని షెల్‌ ఫిష్‌ లేదా మాంసం, కాప్సికం, ఉల్లిపాయతో తయారు చేస్తారు. ‘గంబో’ లూసియానా రాష్ట్ర అధికారిక వంటకం కావడం కూడా విశేషం. తనకు కూడా ‘గంబో’ అంటే చాలా ఇష్టమని, తాను చిన్నప్పుడు కమలా హారిస్‌తో కలిసి చదువుకున్నానని చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ చెబుతున్నాడు.  

డిన్నర్‌ మెనూలో వంటకాలు ఇవేనట..

ఎపిటైజర్‌గా..

పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్‌

మెయిన్‌ డిష్‌లుగా..

గంబోతో పాటు వైట్‌ రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్‌.

స్వీట్లు.. 

బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్‌ 

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని