Sonu Sood: సోనూసూద్‌ నివాసానికి మరోసారి ఐటీ అధికారులు..!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసానికి మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేరుకున్నారు. నిన్న సోనూ నివాసం, కార్యాలయాల్లో

Updated : 16 Sep 2021 14:57 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసానికి మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేరుకున్నారు. నిన్న సోనూ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరోసారి ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు.. లఖ్‌నవూకు చెందిన రియల్‌ఎస్టేట్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

20 గంటల పాటు సోదాలు..

పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలంలో దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ‘‘లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించాం’’ అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొవిడ్‌ వేళ వలసకూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని