
Vaccination: టీకా పంపిణీలో భారత్ మరో రికార్డు
దిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో దూసుకుపోతున్న భారత్ మరో ఘనత సాధించింది. సెప్టెంబర్‌లో దేశ వ్యాప్తంగా 18.74 కోట్ల టీకా డోసులు పంపిణీతో సరికొత్త రికార్డును నమోదుచేసింది. గత ఆగస్టు నెలలో 18.38 కోట్ల డోసులు ఇచ్చి రికార్డు సృష్టించిన భారత్.. తాజాగా దానిని అధిగమించింది. ఈ నెలలో ఇంకో వారంరోజులు మిగిలి ఉండగానే నూతన రికార్డు నమోదుచేసింది. మిగిలి ఉన్న వారంరోజుల్లో చేపట్టే టీకా డ్రైవ్‌తో మొత్తం 20 కోట్ల డోసులను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నివేదికల ప్రకారం.. సెప్టెంబర్‌లో ప్రతిరోజు సగటున 81.48 లక్షల టీకా డోసులు వేశారు. ఇది మే నెలలో డ్రైవ్ కంటే నాలుగు రెట్లు అధికం. మే నెలలో ప్రతిరోజు సగటున 19.72 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా, జూన్‌లో ఆ సంఖ్య 39.85 లక్షలకు చేరింది. జులైలో 43.41 లక్షలు ఉన్న సంఖ్య ఆగస్టులో 59.29కి చేరింది. మే నెల మొత్తంగా దేశంలో 6.11 కోట్ల మందికి టీకాలు వేయగా.. జూన్‌లో 11.9 కోట్ల మందికి వేశారు. జులైలో 13.45 కోట్ల మందికి, ఆగస్టులో 18.38 కోట్ల డోసులు ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు 84 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 65 శాతం మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. 23 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.