Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
తూర్పు లద్దాఖ్‌లో కేంద్రం మరో కీలక రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో చైనాతో వివాదాస్పదంగా మారిన ప్రదేశాలకు ట్యాంకులను తరలించే అవకాశం లభించనుంది.
ఇంటర్నెట్‌డెస్క్: వాస్తవాధీన రేఖ సమీపంలో చైనాతో సరిహద్దులున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత్ సరికొత్త రహదారి నిర్మాణం చేపట్టింది. ఈ రహదారి నిర్మాణంతో పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని చుషూల్‌కు, తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌కు మధ్య అనుసంధానం లభిస్తుంది. ఈ మేరకు 135 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. ఇది టిబెట్ శరణార్థులు దుంగ్తి ప్రాంతం రావడానికి ఉపయోగపడుతుంది. ఇటీవల ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తికానున్నాయి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దీని నిర్మాణ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లోమా ప్రాంతంలోని సింధూ నదిపై ఉన్న ఇనప వంతెనను తొలగించి కాంక్రీట్ వంతెన నిర్మించనున్నారు. చైనాతో సరిహద్దు వివాదం చోటు చేసుకన్న ప్రదేశానికి భారీ ట్యాంకులను అలవోకగా దీనిపై నుంచి తరలించే అవకాశం లభిస్తుంది.
బ్లాక్ టాప్ సమీపం నుంచి లేహ్‌ను అనుసంధానిస్తూ మూడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో తాంగ్సె నుంచి లేహ్‌కు వెళ్లే రోడ్డు ఒకటి. ఇది చాంగ్లా పాస్ మీదుగా వెళుతుంది. మరో మార్గం న్యోమా నుంచి లేహ్‌కు వెళుతుంది. చుషూల్ నుంచి ఉన్న రోడ్డు లోమా వంతెనపై నుంచి వెళుతుంది. ఈ మార్గం తరచు మట్టి లేదా ఇసుకతో కూరుకుపోతుంది. దాదాపు మట్టిరోడ్డులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా చుషూల్-దెమ్‌చోక్ మార్గంతో సరిహద్దుల వెంట మౌలికవసతులు బలోపేతం అవుతాయని లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ త్సాహి గ్యాల్ట్సోన్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Formation Day: తెలంగాణ.. సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు పొందింది..!
-
General News
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
-
India News
IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
General News
Pawan Kalyan: పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్‌కల్యాణ్
-
Sports News
WTC Final: ఓవల్ ఎవరికి కలిసొచ్చేనో?
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు