‘రక్షణ ఉత్పత్తుల సామర్థ్యం పెంచేందుకు కృషి’

ఆయుధాల తయారీలో భారత్‌కు పూర్వ కాలం నుంచే గొప్ప అనుభవం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత ఆ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎవరూ కృషి చేయలేదని ఆయన అన్నారు.

Published : 22 Feb 2021 14:02 IST

దిల్లీ: రక్షణ రంగానికి ఆయుధాల తయారీలో భారత్‌కు పూర్వ కాలం నుంచే గొప్ప అనుభవం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని బలోపేతం చేసేందుకు ఎవరూ కృషి చేయలేదని ఆయన అన్నారు. కానీ, ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెంచేందుకు దేశం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగం కోసం చేపట్టిన ప్రతిపాదనలను అమలు చేసే అంశంపై సోమవారం నిర్వహించిన వెబినార్‌లో మోదీ ఈ మేరకు మాట్లాడారు. 

‘స్వాతంత్ర్యానికి పూర్వం మనకు వందలాది ఆయుధ తయారీ పరిశ్రమలు ఉండేవి. ప్రపంచ యుద్ధాల సమయంలో భారత్‌ నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు ఎగుమతులు అయ్యేవి. కానీ, స్వాతంత్ర్యం తర్వాత ఈ వ్యవస్థ ఊహించిన స్థాయిలో బలోపేతం కాలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మన వద్ద ప్రతిభా, సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆయుధాల తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎవరూ దృష్టి సారించలేదు. ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాం. అది మనం గర్వించదగిన విషయం కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు భారత్‌ కృషి చేస్తోంది. ఆయుధాల తయారీలో సామర్థ్యాలను పెంచేందుకు కట్టుబడి ఉంది’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ డీ లైసెన్సింగ్‌, డీ రెగ్యులేషన్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్ సహా రక్షణ రంగ తయారీ వ్యవస్థకు ఊతమందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని