Corona India : కాస్త తగ్గిన కొత్త కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 3.5 లక్షలకుపైగా కేసులు,

Updated : 04 May 2021 11:26 IST

దిల్లీ : భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 3.5 లక్షలకుపైగా కేసులు, దాదాపు 3500 మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,57,229 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ  వెల్లడించింది. అయితే క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అంతకుముందు రోజు 3.68 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది.

* గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 3,449 మంది ప్రాణాలు కోల్పోగా ..ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2,22,408కి చేరింది.

భారత్‌లో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,66,13,292గా ఉంది. ప్రస్తుతం దేశంలో 34,47,133 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* నిన్న 16,63,742 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 29,33,10,779కి చేరింది.

* నిన్న మహారాష్ట్రలో 48,621 కొత్త కేసులు నమోదు కాదా.. 567 మరణాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటకలో నిన్న 44 వేలకుపైగా కేసులు.. 239 మరణాలు సంభవించాయి.

* ఇక కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు,లాక్‌డౌన్లు. రాత్రి కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి.

* దేశంలో ఇప్పటి వరకూ 15,89 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని