Corona : 81 రోజుల తర్వాత 60 వేల దిగువకు..

దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది.

Updated : 20 Jun 2021 13:36 IST

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,11,446 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి.  81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా 1500 వద్దే నమోదవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..

* కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 2,98,81,965.

* గడిచిన 24 గంటల్లో 1576 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,86,713కి చేరింది.

* ఇక కొత్తగా 87,619 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 2,87,66,009కి పెరిగింది.

* ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,29,243కి తగ్గి.. ఆ రేటు 2.44 శాతానికి చేరింది.

* ఇక మొత్తంగా 27,66,93,572 టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని