India Corona : 20 వేల దిగువకు కొత్త కేసులు.. 1.68%కి తగ్గిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసులు 20 వేల దిగువకు

Updated : 20 Feb 2022 10:08 IST

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసులు 20 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు రికవరీలు గణనీయంగా పెరుగుతుండటంతో.. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

  1. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,87,766 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 19,968 కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2,300 కేసులు తగ్గాయి.
  2. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%కి పడిపోయింది.
  3. నిన్న 673 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,11,903కు చేరింది.
  4. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 48,847 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.20 కోట్లు దాటింది. ఆ రేటు 98.28%కు పెరిగింది.
  5. ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఆ రేటు 0.52%కి పడిపోయి.. ఆ సంఖ్య 2,24,187కు తగ్గింది.
  6. దేశంలో నిన్న 30,81,336 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని