India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు..

గత కొన్ని రోజులుగా 15వేలకుపైగానే నమోదువుతున్న కొత్త కేసులు తాజాగా భారీగా తగ్గాయి.

Updated : 26 Jun 2022 10:06 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే.. గత కొన్ని రోజులుగా 15వేలకుపైగానే నమోదువుతోన్న కొత్త కేసులు తాజాగా భారీగా తగ్గి 11 వేలకు దిగివచ్చాయి. మరోవైపు క్రియాశీల కేసులు 92 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న 4,53,940 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 11,739 కేసులు వెలుగు చూశాయి.

* కొత్త కేసుల్లో కేరళ(4,098), మహారాష్ట్ర (1,728), తమిళనాడు (1,382) నుంచే సగానికిపైగా ఉన్నాయి.

* శనివారం 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,24,999కు చేరింది.

* నిన్న 10,917 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.27 కోట్లు(98.58%) దాటింది.

* ఇక క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ లక్ష వైపునకు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 92,576(0.21%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 12,72,739  మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 197 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని