India Corona : 14 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా 16 వేలకుపైగా నమోదవతూ వస్తోన్న కొత్త కేసులు..

Updated : 14 Aug 2022 11:02 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా 16 వేలకుపైగా నమోదవుతూ వస్తోన్న కొత్త కేసులు.. తాజాగా 14 వేలకు దిగిరావడం కాస్త ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,81,861 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,092 కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిన్న 41 మంది కరోనాతో మరణించారు. వీటిలో 12 మరణాలు కేరళ నుంచే ఉన్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,037కు చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4.42 కోట్ల మందికి వైరస్‌ సోకగా.. 4.36 కోట్ల మంది(98.54%) కోలుకున్నారు.

ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం అవి 1,16,861(0.26%)కు చేరాయి.

నిన్న 28,01,457 మందికి టీకాలు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 207.99 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని