​​​​​కొత్త కేసుల తగ్గుదలకు బ్రేక్‌!

దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గే పరంపరకు బ్రేక్ పడింది. గత 24 గంటల్లో దేశంలో 54,044 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 46,790 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరణాల సంఖ్య సైతం ఎగబాకడం గమనార్హం..............

Updated : 21 Oct 2020 10:45 IST

24 గంటల్లో 54,044 కేసులు.. 717 మరణాలు

దిల్లీ: దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గే పరంపరకు బ్రేక్ పడింది. గత 24 గంటల్లో దేశంలో 54,044 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 46,790 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. తాజాగా 717 మంది వైరస్‌ సోకి మృత్యువాతపడ్డారు. గత రెండురోజులు వరుసగా మరణాలు 600లోపునకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 9.67 శాతంగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 88.81శాతంగా ఉంది. మరణాలు రేటు 1.51 శాతానికి చేరింది. మంగళవారం కొత్తగా 10,83,608 నమూనాల్ని పరీక్షించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడమే కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 76,51,108కు చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,40,090 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 67,95,103 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 1,15,914 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని