100 దిగువకు కొవిడ్ మరణాలు

భారత్‌లో కొవిడ్ మరణాలు మరోసారి 100 దిగువకు చేరాయి.

Updated : 06 Feb 2021 14:23 IST

20 కోట్ల మార్కును దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు

దిల్లీ: భారత్‌లో కొవిడ్ మరణాలు మరోసారి 100 దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 95 మరణాలు సంభవించాయని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఈ నెలలో ఇది రెండోసారి. కాగా, మొత్తం మరణాల సంఖ్య 1,54,918కి చేరింది. మరోవైపు, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 20 కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి 5 నాటికి 20,06,72,589 మంది వైరస్ నమూనాలు స్వీకరించి, పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న 7,40,794 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,713 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా వైరస్ బారినపడిన వారి సంఖ్య 1.08 కోట్లు దాటింది.

ఇక, క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,48,590కి చేరగా..ఆ రేటు 1.40 శాతానికి తగ్గింది. నిన్న 14,488 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దాంతో ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 1,05,10,796(97.16శాతం)గా ఉంది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 4,57,404 మంది కరోనా టీకా తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 54,16,849 మంది టీకా వేయించుకున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి: 

కొవిడ్‌లో కొత్త రకాలను గంటలోనే పట్టేయవచ్చు

వ్యాక్సిన్ లెక్క ఈమె తేలుస్తుంది

 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని