రికవరీ రేటు@ 97.32శాతం

గడిచిన 24 గంటల్లో 7,43,614 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,143 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Published : 13 Feb 2021 10:34 IST

నేటి నుంచి కరోనా రెండో డోసు పంపిణీ

12,143 కొత్త కేసులు..103 మరణాలు

దిల్లీ: గడిచిన 24 గంటల్లో 7,43,614 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,143 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే 30 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 103 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 1.08 కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..1,55,550 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 1,36,571 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.25 శాతానికి తగ్గింది. మొత్తంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైబడింది. నిన్న ఒక్కరోజే 11,395 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..ఆ రేటు 97.32 శాతానికి పెరిగింది. 

నేటి నుంచి కరోనా రెండో డోసు

దేశవ్యాప్తంగా జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 28 రోజులు పూర్తికావడంతో మొదటి రోజున టీకా తీసుకున్నవారికి నేడు రెండో డోసు అందించనున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, నీతీ ఆయోగ్‌ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మొదటి రోజు టీకా తీసుకున్నవారి జాబితాలో ఉన్నారు. వారు ఈ రోజు రెండో డోసు వేయించుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా..ఫిబ్రవరి 12న 4,62,637 మందికి కేంద్రం కరోనా టీకాలు పంపిణీ చేసింది. దాంతో నిన్నటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 79,67,647కి చేరింది.

ఇవీ చదవండి:

మెల్‌బోర్న్‌లో మరోసారి లాక్‌డౌన్

కరోనా వేరియంట్లను ఎలా గుర్తిస్తారంటే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని