కాస్త తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.

Updated : 23 Mar 2021 10:39 IST

199 మంది మృత్యుఒడికి..

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే సోమవారం కొత్త కేసులు 13శాతం మేర తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 40,715 మందికి వైరస్ సోకగా..199 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో ఇప్పటివరకు 1,16,86,796 మంది కొవిడ్ బారిన పడగా..మరణాలు 1.6లక్షల మార్కును దాటినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఇక, క్రియాశీల కేసులు 3,45,377(2.87 శాతం)కి పెరిగాయి. నిన్న 29,785 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 1.11 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి కోలుకోగా..రికవరీ రేటు 95.75 శాతానికి చేరింది. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24,645 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 58 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 22,34,330 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..2,16,540 మంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు.

ఇక, దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. కేంద్రం మార్చి 22 నాటికి 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 32,53,095 మందికి టీకాలు అందించింది. నిపుణుల అభిప్రాయాలను పరిశీలించిన మీదట.. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని ఎనిమిది వారాల వరకు పెంచుతూ కేంద్రం ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని