India corona: ఉప్పెనలా వైరస్‌ వ్యాప్తి

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ రికార్డు స్థాయిలో సంక్రమిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి.

Updated : 25 Apr 2021 10:55 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ రికార్డు స్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కొత్తగా 2,17,113 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110 చేరి, 83.49 శాతానికి తగ్గింది.

తాజాగా కరోనా మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,767 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,92,311 కుచేరింది. ఇక మరణాల రేటు 1.14శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 26,82,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విషయానికొస్తే.. నిన్న 25,36,612 మందికి పైగా వ్యాక్సిన్‌ అందించారు. దీంతో మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 14,09,16,417 కి చేరింది.

మహారాష్ట్ర, దిల్లీలో మరణమృదంగం
మహారాష్ట్ర, దిల్లీలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 67,160 కేసులు నమోదు కాగా, 676 మంది మృతి చెందారు. దిల్లీలో ఒక్కరోజే 24,103 కేసులు నమోదు కాగా.. 357 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని