India corona: ఒక్కరోజే 3,645 మంది మృతి!

దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. నిత్యం లక్షల కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68లక్షల టెస్టులు చేయగా 3,79,257కేసులు నమోదయ్యాయి.

Updated : 29 Apr 2021 11:17 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68లక్షల టెస్టులు చేయగా 3,79,257కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. కొత్తగా 2,69,507మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,50,86,878 చేరి, 82.33శాతానికి చేరింది. 

తాజాగా కరోనా మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,645 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. దీంతో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,04,832కు చేరింది. ఇక మరణాల రేటు 1.12 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 30,84,814 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విషయానికొస్తే.. దేశంలో మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 15కోట్లు దాటింది. 

మహారాష్ట్ర, దిల్లీలో తీవ్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 63వేలకు పైగా కేసులు నమోదు కాగా, రికార్డు స్థాయిలో 1,035 మంది మృతి చెందారు. కాగా, దిల్లీలో ఒక్కరోజే 25వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 368 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు