Corona: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా లక్షకు దిగొచ్చిన రోజూవారీ కేసులు.. సుమారు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. రికవరీ రేటు 94శాతానికి చేరువైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
94 శాతానికి చేరువగా రికవరీ రేటు
కొత్తగా 2,427 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా లక్షకు దిగొచ్చిన రోజూవారీ కేసులు.. సుమారు రెండు నెలల కనిష్ఠానికి చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు 94శాతానికి చేరువైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
తాజాగా 1,00,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2,89,09,975 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా.. 3,49,186 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 15,87,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇక రికవరీలు 2.7కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 1,74,399 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94 శాతానికి చేరువగా కాగా..క్రియాశీల రేటు 5శాతం దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,01,609 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోవైపు ఆదివారం 13.90లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Politics News
BJP: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో మార్పులు..
-
Sports News
IPL 2023: ‘కేఎల్ రాహుల్, డికాక్ ఆరెంజ్ క్యాప్ పోటీదారులుగా ఉంటారు’
-
India News
IN PICS: పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ
-
World News
Helicopters Crash: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు: 9మంది అమెరికా సైనికుల దుర్మరణం