Corona: మూడు నెలల కనిష్ఠానికి కొత్త కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనావైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,88,699 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..53,256 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Published : 21 Jun 2021 09:54 IST

1500 దిగువకు మరణాలు

దిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనావైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,88,699 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..53,256 కొత్త కేసులు వెలుగుచూశాయి. రోజువారీ కేసులు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. తాజాగా మరో 1,422 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఏప్రిల్ 17 తరవాత మరణాల్లో ఈ స్థాయి తగ్గుదల తొలిసారి నమోదైంది. ఇప్పటి వరకు 2,99,35,221 మందికి కరోనా సోకగా..3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈరోజు నిర్ధారణ పరీక్షల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది.

క్రియాశీల కేసులు ఏడు లక్షలకు తగ్గగా..ఆ రేటు 2.44 శాతానికి పడిపోయింది. నిన్న 78,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2.88 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 96.27 శాతానికి చేరింది. 

మరోపక్క నిన్న 30,39,996 మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు టీకా తీసుకొన్న వారి సంఖ్య 28కోట్లకు చేరింది. కరోనా టీకా కార్యక్రమం కింద ఈ రోజు నుంచి 18 ఏళ్లు పైడిన వారికి కూడా ఉచితంగా టీకా పంపిణీ జరుగుతోంది. దీనిపై ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని