India Corona: 38 వేల కేసులు.. 40 వేల రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసులు 30,40 వేల మధ్య ఊగిసలాడుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Published : 07 Aug 2021 09:52 IST

50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. నిన్న 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. నిన్న 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. తాజాగా 40వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు మూడు కోట్ల 10లక్షలకు చేరాయి.

50 కోట్ల డోసులు పంపిణీ..

కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని