India Corona: భారీ ఊరట.. 715 రోజుల తర్వాత వెయ్యి దిగువకు కేసులు..

చైనా, బ్రిటన్‌ వంటి పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తుండగా.. భారత్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి అంతకంతకూ అదుపులోకి వస్తోంది.

Published : 04 Apr 2022 10:28 IST

20 లోపే మరణాలు..

దిల్లీ: చైనా, బ్రిటన్‌ వంటి పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తుండగా.. భారత్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదుకావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు 20 దిగువకు తగ్గిపోయాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

ఆదివారం 3 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..913 మందికి కరోనా సోకినట్లు తేలింది. 715 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. ముందురోజు(1,096) కంటే 16 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే ఉంది. ఇప్పటివరకూ 4.30 కోట్లకు పైగా కరోనా కేసులొచ్చాయి. 

• 24 గంటల వ్యవధిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితంరోజు సంఖ్య 81గా ఉంది. ఇప్పటివరకూ 5.21 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

• నిన్న 1,316 మంది కోలుకోగా.. క్రియాశీల కేసులు 12 వేలకు దిగొచ్చాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. 

• వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పరీక్షల సంఖ్య తగ్గింది. అలాగే టీకా పంపిణీ కూడా నామమాత్రంగానే సాగింది. నిన్న కేవలం రెండు లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. మొత్తంగా 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని