India Corona: అదుపులోనే కరోనా వ్యాప్తి.. కొత్తగా 1,033 మందికి పాజిటివ్‌

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 4.8 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,033 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Published : 07 Apr 2022 10:24 IST

మరణాలెన్నంటే..?

దిల్లీ: స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 4.8 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,033 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 43 మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు 11,632కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.03 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో 4.3 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా.. 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4.24 కోట్ల మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 185 కోట్ల మార్కు దాటింది. 

మరోసారి ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ కోరలు చాస్తోంది. పొరుగున ఉన్న చైనాలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఒమిక్రాన్ వేరియంట్‌లో కొత్త ఉత్పరివర్తన రకం XE కలవరపెడుతోంది. ముంబయిలో కూడా దీని ఆనవాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అది XE వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమంటూ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. భారత్‌లో ప్రారంభ రోజుల నాటికి వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సమయంలో తాజా వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని