India Corona: 20 వేల దిగువకు చేరిన క్రియాశీల కేసులు

దేశంలో తాజాగా కరోనా కేసులు కాస్త తగ్గాయి. మూడు వేల దిగువున నమోదయ్యాయి. నిన్న 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 10 May 2022 10:02 IST

తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా మూడు వేలకుపైగా నమోదువుతున్న కొత్త కేసులు.. నేడు కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. నిన్న 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 3,044 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మరోరోజు కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. దీంతో క్రియాశీల కేసులు 20 వేల లోపునకు చేరాయి. ఇక నిన్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 5.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని మంగళవారం కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని