India Corona: అదుపులోనే కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వస్తున్నాయి.

Published : 18 May 2022 10:13 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 4.34 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,829 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోరోజు రెండు వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ముందురోజుతో పోల్చితే స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 2,549 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మంది మహమ్మారి బారినపడగా.. 4.25 కోట్ల మంది కోలుకోవడంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 15,647(0.04 శాతం)కు పడిపోయాయి. నిన్న 33 మంది ప్రాణాలు కోల్పోయారు.  మరోపక్క దేశవ్యాప్తంగా నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకూ 191 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజు 14.97 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని