India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. తాజా కరోనా గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 6.56 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,313 కొత్త కేసులు వచ్చాయి.

Published : 23 Jun 2022 10:02 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 6.56 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,313 కొత్త కేసులు వచ్చాయి. ఇన్ని రోజులు 12 వేలకు దగ్గర్లో నమోదైన కేసులు తాజాగా పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.03 శాతానికి చేరింది. ఒక్క కేరళలోనే నాలుగు వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కేసులు రాగా, దిల్లీలో ఆ సంఖ్య వెయ్యి దిగువకు చేరింది. ముంబయిలో పాజిటివిటీ రేటు 20 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకూ 4.33 కోట్ల మందికి మహమ్మారి సోకింది. 

ఇన్‌ఫెక్షన్లు విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 83,990కి పెరిగాయి. క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.60 శాతానికి పడిపోయింది. నిన్న 10,972 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 38 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. తాజాగా మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఇక నిన్న 14.91 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ పూర్తిచేసినట్లు  కేంద్రం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని