India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు.. పాజిటివిటీ రేటు ఎంతంటే..?

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా 20 వేలకు పైనే నమోదవుతోన్న కొత్త కేసులు కాస్త తగ్గాయి.

Published : 18 Jul 2022 10:01 IST

50కు పైగా కరోనా మరణాలు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా 20 వేలకు పైనే నమోదవుతోన్న కొత్త కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం 2.61 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,935 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. టెస్టుల సంఖ్య తగ్గడం కూడా కేసులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు పాజిటివిటీ రేటు 6.48 శాతానికి పెరిగింది. ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,44,264 కు చేరాయి. ఇప్పటివరకూ 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో బాధితులు 0.33 శాతంగా ఉన్నారు. నిన్న 16,069 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.47 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 51 మంది మరణించారు. ఒక్క కేరళ నుంచే 29 మరణాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. గత ఏడాది ప్రారంభం నుంచి కేంద్రం తలపెట్టిన టీకా కార్యక్రమం కింద 200 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 4.46 లక్షల మంది టీకా తీసుకున్నారు. మరోపక్క జులై 15 నుంచి 18 ఏళ్లు పైడిన అందరికీ ప్రికాషనరీ డోసు అందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని