India Corona: గణనీయంగా తగ్గిన కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 3.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 12,751 మంది కరోనా సోకినట్లు తేలింది.

Published : 09 Aug 2022 09:55 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 3.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 12,751 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందురోజు ఆ సంఖ్య 16వేలుగా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.50 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 16,412 మంది కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 42 మరణాలు నమోదయ్యాయని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 4.41 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.51 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.31 లక్షల(0.30 శాతం)కు చేరాయి. ఇక నిన్న 31.9 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 206 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని