India Corona: 16 వేల కొత్త కేసులు.. 49 మరణాలు..!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గురువారం 3.04 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,561 మంది వైరస్ బారినపడ్డారు.

Published : 12 Aug 2022 10:01 IST

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గురువారం 3.04 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,561 మంది వైరస్ బారినపడ్డారు. కొద్దిరోజులుగా ఇదే స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. పాజిటివిటీ రేటు 5.44 శాతంగా నమోదైంది. దిల్లీలో 2,726 కేసులొచ్చాయి. అక్కడ పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 18,053 మంది కోలుకున్నారు. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.42 కోట్ల మందికి మహమ్మారి సోకగా.. 98.53 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.23 లక్షల(0.28 శాతం)కు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 17.7 లక్షల మంది టీకా వేయించుకున్నారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని