India Corona: దిల్లీ, ముంబయిలో పెరుగుతోన్న కొత్త కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దిల్లీ, ముంబయిలో కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 19 Aug 2022 09:53 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దిల్లీ, ముంబయిలో కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా కొత్త కేసులు 15 వేలకు పైగా వెలుగుచూశాయి. ముందురోజు కంటే మూడువేల మేర కేసులు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

24 గంటల వ్యవధిలో 4.54 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 15,754 మందికి కరోనా సోకింది. పాజిటివిటీ రేటు 3.47 శాతంగా నమోదైంది. దిల్లీలో 1,964 మంది వైరస్ బారినపడగా.. పాజిటివిటీ రేటు 9.42 శాతానికి చేరింది. ముంబయిలో 1,201 కేసులు రాగా.. జూన్ నెల చివరి తర్వాత ఇవే అత్యధికం. మహారాష్ట్ర వ్యాప్తంగా  2,246 మందికి వైరస్‌ సోకింది. ఇక దేశంలో నిన్న 15,220 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు 1,01,830కి చేరాయి. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.58 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 209 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 31.5 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని