India Corona: మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు..!
దేశంలో కరోనా వైరస్(Coornavirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
దిల్లీ: గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మంది వైరస్ బారినపడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 9 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి. దిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ పెరుగుదలతో క్రియాశీల కేసుల సంఖ్య 49,622(0.11శాతం)కి చేరింది. రికవరీ రేటు 98.70శాతంగా నమోదైంది. కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది. తాజాగా ఉద్ధృతికి XBB.1.16 సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల