COVAX: మరికొన్ని వారాల్లో భారత్‌ నుంచి టీకాల ఎగుమతి..?

మరికొన్ని వారాల్లో భారత్‌ నుంచి విదేశాలకు  కొవిడ్‌ 19 టీకాల ఎగుమతి మొదలు కానున్నట్లు ఓ ఆంగ్లవార్తా సంస్థ పేర్కొంది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన కోవ్యాక్స్‌ ప్రోగ్రాంకు అందజేస్తారని పేర్కొంది.

Published : 09 Nov 2021 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొన్ని వారాల్లో భారత్‌ నుంచి విదేశాలకు  కొవిడ్‌ 19 టీకాల ఎగుమతి మొదలు కానున్నట్లు ఓ ఆంగ్లవార్తా సంస్థ పేర్కొంది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన కొవాక్స్‌ కార్యక్రమానికి అందజేస్తారని వెల్లడించింది. ఏప్రిల్‌ తర్వాత తొలిసారి ఎగుమతులపై భారత్‌ సంస్థలు ఆలోచిస్తున్నాయి. కొవాక్స్‌ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహ నేతృత్వం వహిస్తోంది. టీకాల ఎగుమతిని పునఃప్రారంభించాలని ఆ సంస్థ ఇటీవల భారత్‌ను కోరింది.  దీనికి భారత్‌ కూడా అనధికారికంగా అంగీకరించినట్లు సమాచారం.

ఈ  నేపథ్యంలో కొవాక్స్‌ అధికారులు కొవిషీల్డ్‌ షాట్స్‌ను వివిధ దేశాలకు కేటాయించే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా టీకా అనుమతులు తీసుకొని కొవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ తయారు చేస్తోంది. సీరం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ. ఏప్రిల్‌ నుంచి ఈ సంస్థ కొవిషీల్డ్‌ ఉత్పత్తిని నెలకు 24 కోట్ల స్థాయికి చేర్చింది. అదే నెల నుంచి భారత్‌ ఎగుమతులను నిలిపివేసి దేశీయంగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ అంశంపై సీరం, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని