
Corona Vaccination: 192 కోట్ల టీకాల పంపిణీ.. మరో అరుదైన రికార్డుకు చేరువలో
దిల్లీ: కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతోన్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 191.96కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.
కట్టడిలోనే కరోనా వ్యాప్తి..
కరోనా మహమ్మారి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 3వేల దిగువనే ఉంటున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 4.51లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,259 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు(2,364)తో పోలిస్తే కేసులు కాస్త తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతానికి(0.53శాతం) దిగువనే ఉంది.
ఇక కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 2,614 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,044 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల కేసుల రేటు 0.03శాతంగా ఉంది. నిన్న మరో 20 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5.24లక్షల మందిని మహమ్మారి బలి తీసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
CRDA: రాజధాని రైతులకు రూ.184 కోట్ల కౌలు చెల్లింపు
-
Related-stories News
Andhra News: జులై 1న కొత్త పింఛన్లు లేనట్లే!
-
Related-stories News
Social Media: 87% భారతీయులు ఇదే నమ్ముతున్నారు
-
Ap-top-news News
OTS: సచివాలయాల ఉద్యోగుల మెడపై ఓటీఎస్ కత్తి
-
Ts-top-news News
Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- గెలిచారు.. అతి కష్టంగా
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- డీఏ బకాయిలు హుష్‌కాకి!