Rajnath Singh: ఆ విషయంలో రాముడు, బుద్ధుడి బోధనలే భారత్‌కు స్ఫూర్తి: రాజ్‌నాథ్
భారత్ పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అదే భారత్ విధానమని, రాముడు, బుద్ధుడి బోధనల స్పూర్తి ఈ తత్వాన్ని అలవరచుకున్నట్లు తెలిపారు.
దిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎదురువుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనగలిగే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ యుద్ధాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదని, పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటుందని తెలిపారు. మంగళవారం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) అరుణాచల్ ప్రదేశ్‌లో ఉత్తర సియాంగ్, ఎగువ సియాంగ్ జిల్లాల మధ్య నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్ పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుంది. ఈ తత్వాన్ని రాముడి నుంచి, బుద్ధుడి బోధనల స్ఫూర్తితో అలవరుచుకుంది. ఎవరైనా భారత్‌ను రెచ్చగొట్టాలని చూస్తే వారిని ధీటుగా సమాధానం చెప్పే సత్తా భారత్‌కు ఉంది. ప్రపంచం నేడు అనేక సంఘర్షణలను ఎదుర్కొంటోంది. భారతదేశం ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకం. ఇది మా విధానం’’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ సైతం ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మరో 27 వంతెనలను రాజ్‌నాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో లద్ధాఖ్‌లో ఎనిమిది వంతెనలు ఉండగా.. జమ్మూ-కశ్మీర్లో నాలుగు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదు, సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో మూడు, రాజస్థాన్‌లో రెండు చొప్పున ఉన్నాయి. సుమారు ₹ 724 కోట్ల వ్యయంతో మొత్తం 28 వంతెనలు నిర్మించినట్లు తెలిపారు. వీటి నిర్మాణంతో భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాలకు సులువుగా చేరుకోవడంతోపాటు, స్థానికంగా సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీఆర్వో సరిహద్దు ప్రాంతాల్లో 2021లో 102 ప్రాజెక్టులు, 2022లో 103 ప్రాజెక్టులు పూర్తి చేసిందని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరుదేశాలకు చెందిన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. చైనా సైనికులు ఎల్ఏసీ సమీపంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ సరిహద్దులను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా సరిహద్దుల్లో వంతెనల నిర్మాణం చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన 58 ఏళ్ల దేవ్‌కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్‌పై కాల్పులు
ఉత్తరాఖండ్‌లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్