మయన్మార్‌లో తిరుగుబాటు ఆందోళనకరం 

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను భారత్‌ నిశితంగా పర్యవేక్షిస్తుందని వారు తెలిపారు.

Published : 01 Feb 2021 19:46 IST

స్పందించిన భారత్‌, చైనా

దిల్లీ/నేపిడా: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఆ దేశంలోని కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం, సైనిక నిర్బంధంలో ఉంచడం విచారకరమంది. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునురుద్ధరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

సోమవారం తెల్లవారుజామున మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అనంతరం ఆ దేశ కీలక నేత ఆంగ్‌ సాన్‌ సూకీ, ఆమె పార్టీ అయిన నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమొక్రసీ నేతలను అదుపులోకి తీసుకుంది. గతేడాది నవంబరు 8న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు మయన్మార్‌ సైన్యం గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సైన్యానికి చెందిన ఒక టీవీ ఛానల్‌లో ఒక ఏడాది పాటు సైన్యం ఆధీనంలో మయన్మార్‌ ఉంటుందని ప్రకటించింది.

చైనా స్పందన..

మయన్మార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చైనా స్పందించింది. ‘‘మయన్మార్‌లో పరిస్థితులను మేం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. చైనా.. మయన్మార్‌కు స్నేహపూర్వకమైన పొరుగుదేశం. మయన్మార్‌లోని అన్ని పార్టీలు రాజ్యాంగపరమైన విధులను సక్రమంగా నిర్వర్తించి దేశంలో రాజకీయ, సామాజిక స్థిరత్వాన్ని కొనసాగిస్తాయని ఆశిస్తున్నాం ” అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

బడ్జెట్‌ 2021: పెరగనున్న ఫోన్ల ధరలు

బడ్జెట్‌: ఎరుపు రంగు ఎందుకంటే?

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts