అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు 

దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని .....

Published : 23 Mar 2021 20:24 IST

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదన్నారు. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని