DGCA: అంతర్జాతీయ విమానాలపై కొనసాగనున్న నిషేధం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. తదుపది ఆదేశాల వరకు ఈ నిషేధం కొనసాగనున్నట్లు.......

Published : 01 Mar 2022 01:52 IST

దిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. తదుపరి ఆదేశాల వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగనున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సోమవారం వెల్లడించింది. ‘తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేవరకు షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల సర్వీసుల సస్పెన్షన్‌ను పొడిగించాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది’ అని డీజీసీఏ తెలిపింది. కార్గో కార్యకలాపాలు, ప్రత్యేకంగా ఆమోదం పొందిన విమానాలకు ఈ నిబంధనలు వర్తించవు అని పేర్కొంది.

కరోనా వైరస్‌ ఉద్ధృతితో 2020 మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్‌ విమాన సర్వీసుల్ని భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే 2020 జులై నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద ఎయిర్‌ బబుల్‌ ఏర్పాటు చేసిన కేంద్రం దాదాపు 45 దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని