టీకా పంపిణీలో.. మనమే ముందు

కరోనా కోరల్ని తుంచేసి.. మహమ్మారి వ్యాప్తిని అరికట్టే టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో నిరాటంకంగా, నిర్విరామంగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ దూసుకెళ్తోంది. కేవలం

Published : 03 Feb 2021 15:22 IST

18 రోజుల్లో 40లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్‌

దిల్లీ: కరోనా కోరల్ని తుంచేసి.. మహమ్మారి వ్యాప్తిని అరికట్టే టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో నిరాటంకంగా, నిర్విరామంగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ దూసుకెళ్తోంది. కేవలం 18 రోజుల్లోనే 40 లక్షలకు పైగా మందికి టీకాలు అందించంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 4 మిలియన్ల వ్యాక్సినేషన్‌ మార్క్‌ను చేరుకున్న దేశంగా భారత్‌ చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 18వ రోజైన మంగళవారం దేశవ్యాప్తంగా 1,70,585 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు టీకా వేయించుకున్నారు. దీంతో బుధవారం ఉదయం నాటికి దేశంలో మొత్తంగా 41,38,918 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శరవేగంగా టీకా పంపిణీ జరుగుతోందని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 1 నాటికి తమ ప్రజలకు అత్యధికంగా టీకాలు అందించిన దేశాల జాబితాలో భారత్‌ టాప్‌ 5లో ఉందని తెలిపింది. భారత్‌ కేవలం 18 రోజుల్లోనే 40లక్షల మందికి టీకాలు వేయగా.. అగ్రరాజ్యం అమెరికా ఇందుకు 20 రోజులు తీసుకుంది. ఇక ఇజ్రాయెల్‌, యూకే 39 రోజుల్లో నాలుగు మిలియన్ల మందికి టీకాలు అందించాయి.

ఇక రాష్ట్రాల వారీగా అత్యధికంగా టీకాలు వేసిన జాబితాలో ఉత్తరప్రదేశ్‌ ముందంజలో ఉంది. అక్కడ మంగళవారం రాత్రి నాటికి 4,63,793 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో 3,38,960, మహారాష్ట్రలో 3,18,735, కర్ణాటకలో 3,16,368, మధ్యప్రదేశ్‌లో 2,98,376, గుజరాత్‌లో 2,83,817, పశ్చిమబెంగాల్‌లో 2,84,228 మంది టీకా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, హరియాణా, బిహార్‌లలోనూ లక్ష మందికి పైగా టీకాలు తీసుకున్నారు. 

ఇవీ చదవండి..

97.05 శాతానికి చేరిన రికవరీ రేటు

నకిలీ వ్యాక్సిన్ల సరఫరా: 80మంది అరెస్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని