Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్‌ నెట్‌వర్క్‌ మాదే కానీ..: గడ్కరీ

ప్రేగ్‌లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పాల్గొన్నారు. 

Published : 02 Oct 2023 23:17 IST

ప్రేగ్‌ : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ భారత్‌లో (India) ఉందని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) వ్యాఖ్యానించారు. ప్రేగ్‌లో ఏర్పాటు చేసిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌ సమావేశంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ‘ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్‌ నెట్‌వర్క్‌ మా దగ్గర ఉంది. అదే విధంగా మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ తయారీదారుగానూ కొనసాగుతున్నాం. ఈ రెండూ మా బలం. అయితే మా వద్ద అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశం దేశానికి పెద్ద సమస్యగా మారిందని’ గడ్కరీ చెప్పారు. 

కార్‌పూలింగ్‌పై నిషేధం వైట్‌ నంబర్‌ ప్లేట్‌ వాహనాలకు మాత్రమే: కర్ణాటక రవాణాశాఖ మంత్రి

ప్రమాదాలను నివారించేందుకు ఆటోమొబైల్ ఇంజినీరింగ్, రోడ్ ఇంజినీరింగ్‌, ఎమర్జెన్సీ, విద్య తదితర విషయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకొని అమలు పరిచామని గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించే వారి ఆటకట్టించడానికి పార్లమెంటులో చట్టాలు సైతం చేశామన్నారు. అయితే, ఆశించిన ప్రయోజనాలు రావడం లేదని చెప్పారు. ఈ విషయంలో విజయం సాధించాలంటే మానవ ప్రవర్తనే కీలకమని గడ్కరీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పాఠ్యపుస్తకాల్లో రోడ్డు భద్రత విద్యను భాగస్వామ్యం చేశామన్నారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, సామాజిక సంస్థల సాయంతో నిరంతరం పౌరులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.

కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్ ఏటా 3శాతం జీడీపీని కోల్పోతోందని ఈ సందర్భంగా గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ను చేపట్టిందని, అందులో భాగంగా 2030 నాటికి ప్రమాదాలను 50 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని