Organ Transplants: భారత్‌లో ఏడాదికి 15వేల అవయవ మార్పిడిలు..!
ప్రతిఏటా దేశంలో అవయవ మార్పిడి (Organ Transplant) కేసులు భారీగా జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది. గతేడాది 15వేల మార్పిడిలు జరిగాయని.. మునుపటితో పోలిస్తే 27శాతం సర్జరీలు పెరిగాయని తెలిపింది.
దిల్లీ: కొన్నేళ్లుగా వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత, అవయవ దానంపై (Organ Donation) ప్రజల్లో పెరుగుతోన్న అవగాహనతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో అవయవ మార్పిడి (Organ Transplant) శస్త్రచికిత్సలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య ఏడాదికి 15వేలకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో అవయవ మార్పిడిల సంఖ్య ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
‘కొవిడ్ తర్వాత అవయవ మార్పిడి కేసుల్లో ఎంతో వేగం పెరిగింది. గతేడాది 15వేల మార్పిడిలు జరిగాయి. ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. ఇంతకుముందుతో పోలిస్తే అవయవ మార్పిడి కేసుల సంఖ్యలో 27శాతం పెరుగుదల కనిపించింది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన నోటో సైంటిఫిక్ డైలాగ్-2023 (NOTTO) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వీటికోసం కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలోనూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయని చెప్పారు.
భారత్‌లో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన జీవన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, అవగాహన వ్యూహాలు ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. వీటిపై ప్రజల్లో ఎంతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 640 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. అవయవ మార్పిడి సర్జరీ చేసే సదుపాయం కొన్నింటిలోనే ఉందని, వీటిని మరింత పెంచాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్‌పై కాల్పులు
ఉత్తరాఖండ్‌లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్‌మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..