Published : 21 Apr 2022 01:50 IST

Coal Shortage: ‘30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు.. కొరత ప్రశ్నే లేదు’

దిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నందున భయపడాల్సిన అవసరమేదీ లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం కోల్‌ ఇండియా వద్ద 72.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్‌ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. రోజూ సగటున 2.1 మిలియన్‌ టన్నుల బొగ్గు ప్లాంట్లకు వస్తోందని, దేశంలో బొగ్గు కొరతకు అవకాశమే లేదని ఆయా వర్గాలు వెల్లడించాయి. పవర్‌ ప్లాంట్ల వద్ద 10 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా.. మొత్తంగా నెల రోజులకు తగ్గ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సరిపడా లేవని, దీనివల్ల విద్యుత్‌ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటూ అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య (AIPEF) ఆందోళన వ్యక్తంచేసింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ నివేదికను పరిశీలిస్తే.. దేశీ బొగ్గును వినియోగించే 150 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు గానూ 81 చోట్ల నిల్వలు క్షీణించినట్లు తెలుస్తోందని సమాఖ్య ఛైర్మన్‌ శైలేంద్ర ధూబే అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు బొగ్గు నిల్వలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మరోవైపు పవర్‌ ప్లాంట్లతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని మరో అధికారి తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని