కరోనా:భారత్‌ను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.

Published : 06 Feb 2021 13:39 IST

దిల్లీ: కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ..భారత్‌ తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు.

‘కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకోవడంలో భారత్‌ గొప్ప పురోగతి సాధించింది. చిన్నపాటి ప్రజారోగ్య పరిష్కారాలను పాటించగలిగితే..వైరస్‌ను ఓడించవచ్చని ఇది మనకు చూపిస్తోంది. ఈ క్రమంలో టీకాలను జోడించడంతో, మనం మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు’ అని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో కరోనా వైరస్ వెలుగుచూసిన దగ్గరి నుంచి..సెప్టెంబర్ నెల మధ్య వరకు కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఒక దశలో కేసులు లక్షకు చేరువయ్యాయి. అయితే, ఆ తరవాత నుంచి రోజూవారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 10 వేల నుంచి 20 వేల మధ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒక్కోసారి పదివేల దిగువకు పడిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించి, తదనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే పార్లమెంట్‌లో వెల్లడించారు. తాజాగా దేశంలో 11,713 కొత్త కేసులు వెలుగుచూడగా..95 మరణాలు సంభవించాయని శనివారం కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి:

100 దిగువకు కొవిడ్ మరణాలు

అతడికి కరోనా గురించి తెలియదు!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని