Covid vaccine: వ్యాక్సిన్ మైత్రి.. విదేశాలకు 7.23 కోట్ల డోసుల సరఫరా

ఈ ఏడాది జనవరిలో ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి నవంబరు వరకు 94 దేశాలతోపాటు రెండు ఐరాస సంస్థలకు 7.23 కోట్లకు పైగా కొవిడ్‌ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. ఇందులో గ్రాంట్...

Published : 07 Dec 2021 23:40 IST

దిల్లీ: ఈ ఏడాది జనవరిలో ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి నవంబరు వరకు 94 దేశాలతోపాటు రెండు ఐరాస సంస్థలకు 7.23 కోట్లకు పైగా కొవిడ్‌ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. ఇందులో ఉచితంగా, వాణిజ్య విధానంలో సరఫరా అయినవి కూడా ఉన్నట్లు చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలు.. 150 దేశాలకు కరోనా సంబంధిత వైద్య, ఇతర సహాయ సహకారాలు అందించినట్లు మంత్రి వివరించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

50కు పైగా దేశాల నుంచి సాయం..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో 50కి పైగా దేశాల నుంచి వైద్య సామగ్రి, ఔషధాల రూపంలో మన దేశానికి సాయం అందినట్టు కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా దేశాల ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోని భారతీయ సంఘాలు ఇందుకు చొరవ చూపినట్లు పేర్కొన్నారు. పేద దేశాలకు టీకాల సరఫరా విషయంలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమానికి ఇప్పటివరకు 2.22 కోట్ల డోసులను కేంద్రం సరఫరా చేసినట్లు వెల్లడించారు. జనవరిలోనే భారత్‌ నుంచి టీకాల ఎగుమతి మొదలైనా.. సెకండ్‌ వేవ్‌ సమయంలో దీనికి బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. తదనంతరం వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మళ్లీ ఎగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని