
Modi In Japan: భారత్-జపాన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ
టోక్యో: భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపనీయుల పెట్టుబడులు భారతదేశ అభివృద్ధి గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు వెళ్లిన ప్రధాని.. తొలి రోజు టోక్యోలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. జపాన్‌తో భారత్ బంధం ఆధ్యాత్మికమైందని, సహకారంతో కూడుకున్నదన్నారు. ‘‘భారత్, జపాన్ సహజ భాగస్వాములు. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోంది. నేటి ప్రపంచం బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఎదుర్కొంటొన్న హింస, అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు.. ఇలాంటి అనేక సవాళ్ల నుంచి మానవాళిని అదే కాపాడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఎంత పెద్ద సమస్య వచ్చినా భారత్ పరిష్కారాన్ని కనుగొంటోందని.. కరోనా మహమ్మారి సమయంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నా మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు కోట్లాది భారతీయులతో పాటు దాదాపు 100 దేశాలకు సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాను జపాన్‌కు ఎప్పుడు వచ్చినా అందరూ తమ ఆప్యాయత చూపిస్తున్నారని ప్రవాస భారతీయులను ఉద్దేశించి అన్నారు. ‘‘మీలో చాలా మంది ఎన్నో ఏళ్ల క్రితం జపాన్ వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడి సంస్కృతిని అలవర్చుకున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, భాషల పట్ల నిబద్ధత పెరుగుతోంది’’ అంటూ మోదీ పేర్కొనగా.. ప్రవాస భారతీయులు ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. మరోవైపు, భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జపాన్ ప్రధాని కిషిదతో, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో చర్చలు జరపనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత