Nasscom: ఐటీ స్టార్టప్స్‌లో దూసుకుపోతున్న భారత్‌

ఐటీ స్టార్టప్‌ల రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆరో స్థానంలో ఉన్నట్లు ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ వెల్లడించింది.

Published : 20 Jun 2024 20:32 IST

దిల్లీ: ఐటీ స్టార్టప్‌ల రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆరో స్థానంలో ఉన్నట్లు ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ వెల్లడించింది. భారత్‌లో అధికారికంగా 3,600 అంకుర సంస్థలుండగా.. వాటి ద్వారా గత ఏడాది 850 మిలియన్‌ డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది. ఈమేరకు గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం అంకురాల్లో 480 సంస్థలు గతేడాదిలోనే ప్రారంభమైనట్లు తెలిపింది. 2022లో నమోదైన సంస్థల కంటే ఇవి దాదాపు 2 రెట్లు ఎక్కువ. మరోవైపు ఈ ఏడాది మొదలుపెట్టిన స్టార్టప్‌లలో 74 శాతం ప్రధానంగా కృత్రిమమేధపైనే దృష్టిసారించినట్లు నాస్కామ్‌ పేర్కొంది. 2014-2022 మధ్య కాలంలో ఏఐ ఆధారిత అంకురాల సంఖ్య 62 శాతం పెరిగినట్లు తెలిపింది.

భారత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, స్పేస్‌ టెక్‌, రోబోటిక్స్‌తోపాటు విద్య, వినోదం, వ్యాపారం, వ్యవసాయం తదితర కేటగిరీల్లో పెద్ద ఎత్తున స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తున్నట్లు నాస్కామ్‌ డీప్‌టెక్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌ వేణుగోపాల్‌ వెల్లడించారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్‌.. సామాజిక పరివర్త ప్రక్రియలో భాగమైన సాంకేతికతలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉందని కొనియాడారు. మరోవైపు అనతి కాలంలోనే సాంకేతిక అంకుర రంగంలో భారత్‌ మూడో స్థానానికి చేరుకుంటుందని నాస్కామ్‌ డీప్‌టెక్‌ అధిపతి క్రితిక మురుగేశన్‌ అన్నారు. అయితే, దీనికి స్థానిక పరిస్థితులు కూడా అనుకూలించాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని