Prisoners List: పాక్‌ చెరలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ఎంతో తెలుసా!

భారత్‌, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాల జాబితాలను శుక్రవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్‌ చెరలో.. భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న...

Published : 02 Jul 2022 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాల జాబితాలను శుక్రవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్‌ చెరలో.. భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 49 మంది పౌర ఖైదీలు, 633 మంది మత్స్యకారులు ఉన్నారు. అదే విధంగా.. భారత్ కస్టడీలో 309 మంది పాకిస్థానీ పౌర ఖైదీలు, 95 మంది జాలరులు ఉన్నారు. తమ పౌర ఖైదీలు, రక్షణా సిబ్బందితోపాటు మత్స్యకారులను వారి పడవలతోసహా త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా పాక్‌కు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే శిక్ష పూర్తి చేసుకున్న ముగ్గురు పౌర ఖైదీలతోపాటు 536 మంది మత్స్యకారులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఇప్పటికే వారి జాతీయతను నిర్ధారించి పాక్‌కు సమాచారం అందించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అదే విధంగా అక్కడున్న 105 మంది జాలరులు, 20 మంది పౌర ఖైదీలకు తక్షణమే దౌత్య సాయం అందేలా చొరవ చూపాలని కోరింది. 2008లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు ఏటా రెండు సార్లు(జనవరి 1, జూలై 1న)  దౌత్య మార్గాల ద్వారా ఈ వివరాలను పరస్పరం పంచుకుంటాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్‌, పాక్‌ల మధ్య ఖైదీల గుర్తింపు, విడుదల ప్రక్రియ వేగవంతం అయింది. అయితే, కొన్నేళ్లుగా ద్వైపాక్షిక ఉద్రిక్తతలతో ఇది కాస్తా మందగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని