Global Innovation Index: జీఐఐ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 46వ స్థానం

‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2021’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 46వ స్థానం సాధించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(డబ్ల్యూఐపీఓ) సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ గతేడాది 48వ స్థానంలో...

Published : 20 Sep 2021 23:03 IST

దిల్లీ: ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2021’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 46వ స్థానం సాధించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ గతేడాది 48వ స్థానంలో నిలవగా, ఈసారి రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌.. ఆరేళ్లలో 25 స్థానాలు ఎగబాకడం విశేషం. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. భారత్‌ తాజా ర్యాంకింగ్‌పై నీతి ఆయోగ్‌ స్పందిస్తూ.. అంకుర సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం ర్యాంకింగ్‌ మెరుగుదలకు దోహదపడిందని పేర్కొంది. ఇన్నోవేషన్‌ హబ్‌గా దేశ ప్రగతి వెనుక విధానపర ఆవిష్కరణలు కారణమని ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మనిర్భర్‌ తదితర వినూత్న విధానాలతో మహమ్మారి సమయంలోనూ మెరుగైన వాతావరణం సాధ్యపడిందని చెప్పింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అంతరిక్షం తదితర విభాగాలు దేశ ఆవిష్కరణల రంగాన్ని సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని