Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు 10వేలకు పైనే ఉంటున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 11,793 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజు నమోదైన కేసులతో(17,073)

Published : 28 Jun 2022 10:14 IST

కాస్త తగ్గిన కొత్త కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు 10వేలకు పైనే ఉంటున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 11,793 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజు నమోదైన కేసులతో(17,073) పోలిస్తే దాదాపు 5వేల తక్కువ కేసులు నమోదవ్వడం కాస్త ఊరటనిస్తోంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు కూడా నిన్నటితో(5శాతం) పోలిస్తే సగానికి తగ్గడం సానుకూలాంశం. నేడు పాజిటివిటీ రేటు 2.49శాతంగా ఉంది. అయితే క్రియాశీల కేసులు లక్షకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96,700 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం కరోనా లెక్కలు ఇలా ఉన్నాయి..

* సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య : 4,73,717

* కొత్తగా నమోదైన కేసులు : 11,793

* రోజువారీ పాజిటివిటీ రేటు : 2.49%

* వీక్లీ పాజిటివిటీ రేటు : 3.36%

* నిన్న చోటుచేసుకున్న మరణాలు : 18 ( మొత్తం మరణాలు 5,25,047)

* రికవరీలు : 9,486 (మొత్తం కోలుకున్నవారు 4.27 కోట్లు)

* రికవరీ రేటు : 98.57%

* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య : 96,700

* క్రియాశీల రేటు : 0.22%

నిన్న పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసులు : 19.21లక్షలు

* ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్లు : 197.31కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని