India Corona: మరోసారి 12వేలు దాటిన కరోనా కేసులు
గత కొద్దికాలంలో కట్టడిలోనే ఉన్న కరోనా వైరస్(Coronavirus).. తాజాగా విస్తరిస్తోంది. తాజాగా మరోసారి కేసులు పెరిగాయి.
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న 42మరణాలు నమోయ్యాయి. అందులో కేరళ నుంచే 10 మరణాలు రికార్డు కాగా.. అవి సవరించిన గణాంకాలుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘కొవిడ్ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. వైరస్ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశలోనే దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.