Updated : 04 Jul 2022 10:29 IST

India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు

4.85 శాతానికి పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 3.32 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,135 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కూడా అదే స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,13,864కి చేరాయి. క్రియాశీల రేటు 0.26 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.53 శాతానికి పడిపోయింది. నిన్న 13,958 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా మరణించారు. ఇప్పటివరకూ 197 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న సెలవురోజు కావడంతో 1,78,383 మంది మాత్రమే టీకా తీసుకున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని