India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 3.56 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా. . 16,299 మంది కరోనా బారినపడ్డారు.

Published : 11 Aug 2022 10:18 IST

దిల్లీ: దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 3.56 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,299 మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉంది. ముందురోజు కూడా ఇదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే గత కొద్దిరోజులుగా దిల్లీలో రెండువేలకు పైగానే కేసులు వస్తున్నాయి. నిన్న పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.  

వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.25 లక్షల(0.28 శాతం)కు చేరాయి. 24 గంటల వ్యవధిలో 19,431 మంది కోలుకున్నారు. కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. ఇప్పటివరకూ 4.42 కోట్ల మంది మహమ్మారి బారినపడగా.. 98.53 శాతం మంది వైరస్‌ను జయించారు. నిన్న 53 మంది మరణించారు. దేశ రాజధానిలో ఎనిమిది మరణాలు నమోదవగా.. దాదాపు ఆరు నెలల కాలంలో ఇవే అత్యధికం. ఇక దేశంలో ఇప్పటివరకూ 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో 25.75 లక్షల మంది నిన్న వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్రం తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని